స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -34 లో.... ధీరజ్ తన తండ్రికి తెలియకుండా తన అన్న పెళ్లి చేసినందుకు తన తండ్రి ఎంత బాధపడుతున్నాడోనని మిల్ లో పని చేసే సింహాద్రితో చేప్తాడు. మళ్ళీ మీరందరు కలిసి ఉండే రోజు వస్తుందని అతను అంటాడు. అప్పుడే రామరాజు రావడం చూసి ధీరజ్ దాక్కుంటాడు. మరొకవైపు ధీరజ్ గురించి వేదవతి బాధపడుతుంటే.. నర్మద చూడలేకపోతుంది.
అక్కడే ఉన్న వేదవతి తమ్ముడు తిరుపతిని పిలిచి ధీరజ్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి బాబాయ్ అని అడుగుతుంది. నాకు తెలియదు కానీ ఎప్పుడు వాడిని కనిపెట్టుకొని తిరిగే మా ప్రేమకి తెలుసని తిరుపతి చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ నీతో మాట్లాడాలని నర్మద అనగానే.. ఇక్కడ కాదూ బస్టాండ్ దగ్గరికి రా అని నర్మదకి ప్రేమ చెప్తుంది. మరొకవైపు రామరాజు దగ్గరికి బియ్యం బస్తాల లెక్కలు చెప్పి డబ్బులు ఇవ్వడానికి ఒకతను వస్తాడు. నడిపోడు ఆ లెక్కలు రాస్తాడని అనుకోని బుక్ లో ఉన్నవి రామరాజు చెప్తుంటే తప్పుడు లెక్కలు చెప్తున్నావని అతను రామరాజుని తిడతాడు. అప్పుడే సాగర్ వచ్చి లెక్కలు చెప్తాడు. అవి మా నాన్న రాయలేదు వేరొకరివి చెప్పారు. ఆ మాత్రానికే తిడతారా అని సాగర్ అతనిపై కోప్పడుతాడు.
మరోవైపు నర్మదని కలుస్తుంది ప్రేమ. నాకు ధీరజ్ ఎక్కడున్నాడో చెప్పవా అని అనగానే.. చూపిస్తానంటూ తన వెంట తీసుకొని వెళ్తుంది నర్మద. ధీరజ్ గురించి గొప్పగా చెప్తుంటే ప్రేమ వినలేకపోతుంది. రైస్ మిల్ దగ్గరికి తీసుకొని వెళ్లి ఇక్కడే ఉంటాడు ధీరజ్ అని ప్రేమ చెప్తుంది. నాకూ ఎలా తెలుస్తుందని నర్మద అనగానే.. నేను వెళ్లి చూసి వస్తానంటు ప్రేమ వెళ్తుంది. అక్కడ రామరాజు లాగా మిమిక్రీ చేసి ధీరజ్ నీ ప్రేమ ఆడుకుంటుంది. తరువాయి భాగంలో ధీరజ్ ఇంటికి వస్తాడు. మళ్ళీ వచ్చావ్ ఏంటి రా అని గెంటేయ్యబోతుంటే.. ఆగండి అంటూ వేదవతి ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.